జాతీయంPolitical Earthquake | బ్లడీ హెల్.. ఇది రాజకీయ భూకంపం! ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ట్రెండ్స్‌పై...

Political Earthquake | బ్లడీ హెల్.. ఇది రాజకీయ భూకంపం! ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ట్రెండ్స్‌పై సీఎం ఒమర్ అబ్దుల్లా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఫలితాలను రాజకీయ భూకంపంగా వర్ణించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Earthquake | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ (Mamata Banerjee) కోటను బీజేపీ బద్దలు కొడుతుండగా.. అసోంలో మరోసారి కషాయ సేన సత్తా చాటింది.

కేరళంలో అధికార మార్పిడికి ఓటర్లు మొగ్గు చూపగా.. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తోంది. ఇక ఆసక్తికరంగా తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Political Earthquake | జమ్మూ కశ్మీర్ సీఎం పోస్ట్ వైరల్ ..

ఓవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ సెన్సేషన్‌గా మారింది. ఎన్నికల ఫలితాల సరళిని చూసి ఆశ్చర్యపోయిన ఆయన ‘బ్లడీ హెల్’ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. దీనికి షాక్ అయ్యే ఎమోజీలను కూడా జోడించారు. ఏదైనా ఊహాతీత సంఘటన జరిగినప్పుడు బ్లడీ హెల్ అనే పదాలను వాడుతుంటారు. పశ్చిమబెంగాల్ , తమిళనాడు ఎన్నికల (Tamil Nadu Elections) ఫలితాల సమయంలో ఆయన ఈ పదబంధాన్ని ప్రయోగించడం గమనార్హం.తర్వాత మొదటి పోస్ట్ కు కొనసాగింపుగా మరో పోస్ట్ పెట్టారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ (BJP) భారీ ఆధిక్యతను, తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభావాన్ని గురించి ప్రస్తావిస్తూ రాజకీయ భూకంపంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Political Earthquake | 2029 వరకు ప్రభావం !

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో బీజేపీ గెలవడం సాధ్యం కాదని చాలా మంది భావించారు. అయితే ఆ పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తూ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. నటుడు విజయ్ పార్టీ టీవీకే మూడో స్థానానికి పరిమితం అవుతుందని భావించారు. కానీ ఆ పార్టీనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అతి సమీపానికి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలోనే ఒమర్ అబ్లుల్లా ‘రాజకీయ భూకంపం’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘ఈ ఫలితాల తాలూకు ప్రకంపనలు దేశవ్యాప్తంగా చాలా కాలం పాటు వినిపిస్తాయి. బహుశా 2029 సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రభావం ఉంటుంది” అని ఆయన విశ్లేషించారు.

ఇది కూడా చదవండి..: India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ...

Tamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tamil Nadu Election Shock | తమిళనాడు ఎన్నికల...

Collector Ila Tripathi | లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకుసాగాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Collector Ila Tripathi | విద్యార్థులు లక్ష్యాన్ని...

Sun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sun TV Shares | తమిళనాడు అసెంబ్లీ...