అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRICS Summit | బ్రిక్స్ సదస్సుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సదస్సుతో భారత్ కలిగే ప్రయోజనాలు ఏమిటని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించగా.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (MP Shashi Tharoor) స్పందిస్తూ, ఈ కూటమి భారత్ “దౌత్యపరమైన సమన్వయ శక్తిని” చాటుతోందని అన్నారు.
ఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి ముందు మాట్లాడిన థరూర్ ఈ కూటమిని ‘గ్లోబల్ సౌత్’కు ఒక ముఖ్యమైన వేదికగా అభివర్ణించారు. గ్లోబల్ సౌత్‌లో 100కు పైగా దేశాలు ఉన్నప్పటికీ, ఇక్కడ ఆ ప్రాంతానికి చెందిన 11 కీలక దేశాలు ఉన్నాయని థరూర్ అన్నారు. మనం వాటికి నాయకత్వం వహిస్తున్నామని వెల్లడించారు. ఈ 11 BRICS దేశాల కూటమి ప్రపంచ జనాభాలో అధిక భాగానికి, ప్రపంచ జీడీపీలో 41 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.
BRICS Summit | చిన్న విషయం కాదు..
బ్రిక్స్ కూటమి చిన్న విషయం కాదని శశిథరూర్ అన్నారు. మిగిలిన ప్రపంచం దీనిని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలే కాకుండా పరిశీలక హోదా కలిగిన దేశాల అధినేతలు కూడా ఇక్కడికి రావడం మనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం అని చెప్పారు. ఇది మనకున్న దౌత్యపరమైన సమన్వయ శక్తిని తెలియజేస్తుందన్నారు. అత్యవసరమైన ప్రపంచ సమస్యలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో ఉన్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణపై ఉమ్మడి ప్రకటన చేయడానికి BRICS విదేశాంగ మంత్రులు అంగీకరించలేకపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి..: Khade Hanuman Temple | కదలని హనుమంతుడు.. 11 రోజులుగా భారీ యంత్రాలతో పెకిలించే ప్రయత్నం.. ఉజ్జయినిలో అద్భుత ఘటన