Billionaires India | భారత్‌లో 207 మంది బిలియనీర్లు.. ఐదేళ్లలో 51 శాతం పెరగనున్న కుబేరులు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Billionaires India | ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత్‌లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉన్నారు. అయితే వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 51 శాతం పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ (Knight Frank) అనే సంస్థ అంచనా వేస్తోంది.

అంటే 2031 నాటికి దేశంలో కుబేరుల సంఖ్య 313కి చేరుతుందన్న మాట. అత్యధికంగా అమెరికాలో 914 మంది బిలియనీర్లు ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ (India) మూడో స్థానంలో ఉంది.

Billionaires India | వేగంగా సంపద సృష్టి..

బిలియన్ డాలర్లకు మించి సంపద ఉన్నవారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. 30 మిలియన్ డాలర్లకుమించి ఆస్తులున్న వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా పేర్కొంటారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్‌ఫ్రాంక్ ఇటీవల తన 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా జియో పొలిటికల్ టెన్షన్స్, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ సంపద సృష్టి మాత్రం వేగంగా జరుగుతోందని ఆ నివేదిక పేర్కొంటోంది. భారతదేశంలో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతోందని తెలిపింది.

Billionaires India | అల్ట్రా హెచ్ఎన్ఐలు ముంబైలోనే అధికం..

అల్ట్రా హెచ్ఎన్ఐలు(Ultra HNI) ప్రస్తుతం భారత్‌లో 19,877 మంది ఉండగా.. ఐదేళ్లలో వీరి సంఖ్య 25,217కు చేరుకుంటుందని చెబుతున్నారు. కాగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలోనే ఎక్కువ మంది అత్యంత ధనవంతులు ఉన్నారు. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం ఇక్కడే నివసిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి..: Amit Shah | దీదీ ఇంటికి.. బీజేపీ అధికారంలోకి : అమిత్ షా

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *