Cancer Drug Smuggling|క్యాన్సర్ మందుల అక్రమ రవాణాపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. కేంద్రం, CDSCO లకు కోర్టు నోటీసులు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Cancer Drug Smuggling|భారతదేశంలో క్యాన్సర్ రోగుల కోసం ఉద్దేశించిన అత్యవసర ప్రాణ రక్షణ ఔషధాలు అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నాయనే వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేవలం భారతదేశంలో మాత్రమే అమ్మాలనే నిబంధన ఉన్న(“For Sale in India Only”) అత్యంత ఖరీదైన క్యాన్సర్ మందులను, కొందరు వ్యాపారులు అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారంటూ కోర్టులో ఒక కేసు (PIL) నమోదైంది.”స్థానిక మార్కెట్ నుండి ఈ మందులను గుట్టుచప్పుడు కాకుండా సేకరించి, ఇతర సరుకులతో కలిపి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Cancer Drug Smuggling|రంగంలోకి హైకోర్టు డివిజన్ బెంచ్..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మందుల అక్రమ రవాణా వ్యవహారాన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణించింది. దేశీయ అవసరాల కోసం ఉద్దేశించిన ప్రాణ రక్షణ ఔషధాలు ఇలా పక్కదారి పట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ అక్రమ దందాపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు డ్రగ్స్ కంట్రోల్ సంస్థ (CDSCO), విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ (DGFT), కస్టమ్స్ విభాగానికి చెందిన CBIC, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) లకు ఢిల్లీ హైకోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసింది.

Cancer Drug Smuggling|ప్రత్యేక బృందం (SIT) తో దర్యాప్తునకు డిమాండ్..

ఈ భారీ మందుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్, పెద్ద సరఫరా గొలుసు (Supply Chain) ఉందని పిటిషనర్లు ఆరోపించారు. దీని గుట్టు రట్టు చేయాలంటే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో రోగులకు అందాల్సిన అత్యవసర ఔషధాలు పక్కదారి పడుతున్న తరుణంలో, ఢిల్లీ హైకోర్టు ఈ స్థాయిలో స్పందిస్తూ అన్ని కీలక శాఖలకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: EPFO WhatsApp | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ ద్వారా సేవలు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *