PF Withdrawal | కేంద్రం కీలక నిర్ణయం.. రూ. 5 లక్షల వరకు పీఎఫ్ విత్‌డ్రా ఇక సులువు

లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ విత్‌డ్రా ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 'EPFO 3.0' కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PF Withdrawal | లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ విత్‌డ్రా ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘EPFO కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పీఎఫ్ సేవలు అత్యంత వేగంగా అందుబాటులోకి రానున్నాయి.

PF Withdrawal | 3 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్..

పాత విధానంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం వారాల సమయం పట్టేది. కొత్త టెక్నికల్ మార్పుల వల్ల ఇకపై కేవలం 3 పని దినాల్లోనే నగదు ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ వేగం వల్ల ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో గొప్ప ఊరట లభించనుంది. అర్హులైన ఖాతాదారులు రూ. 5 లక్షల వరకు పీఎఫ్ మొత్తాన్ని ‘ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్’ ద్వారా నేరుగా పొందవచ్చు. దీని కోసం ఎలాంటి మాన్యువల్ అనుమతుల కోసం వేచి చూడాల్సిన పని లేదు, సిస్టమే స్వయంగా క్లెయిమ్‌లను ఆమోదిస్తుంది.

epf

PF Withdrawal  | అన్ని వివరాలు ఒకేచోట..

దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఉద్యోగులు ఉద్యోగ బదిలీలైనా లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా, తమ పీఎఫ్ వివరాలను ఒకే చోట సులువుగా చూసుకోవచ్చు. సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో ఈపీఎఫ్‌వో కీలక నిబంధనను తెచ్చింది. ఒకవేళ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో 20 రోజులకు పైగా జాప్యం జరిగితే, అందుకు బాధ్యులైన అధికారులు జరిమానా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

PF Withdrawal  | బ్యాంక్ ఖాతా వివరాలు సక్రమంగా ఉండేలా..

ఈ వేగవంతమైన సేవలు పొందాలంటే మీ ఆధార్‌తో అనుసంధానమైన UAN నంబర్, పూర్తి చేసిన కేవైసీ (KYC), , బ్యాంక్ ఖాతా వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీ పీఎఫ్ అకౌంట్‌ను తనిఖీ చేసుకుని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  YouTuber Ravan Arrest | యూట్యూబర్ రావణ్ అరాచకాలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *