అక్షరటుడే, వెబ్డెస్క్: Samosa Train Viral Video | సమోసాల కోసం లోకో పైలెట్ ఏకంగా ప్యాసింజర్ రైలును ఆపాడని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Samosa Train Viral Video | సమోసాల కోసం రైలును ఆపారని
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. ప్యాసింజర్ రైలును లోకోపైలెట్ జంక్షన్ వద్ద ఆపాడు. అనంతరం పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి సమోసాలు కొనుగోలు చేశాడు. అనంతరం ఆయన తిరిగి వెళ్లిన తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది. దీంతో సమోసాల కోసం రైలును ఆపారని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయింది. దీంతో రైల్వే అధికారులు (Railway Officers) ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.
Samosa Train Viral Video | తప్పుడు సమాచారం వ్యాప్తి..

ఇండోర్ సమీపంలోని ‘రౌ’ (Rau) ప్రాంతంలోని ‘రంగ్వాసా రోడ్’ వద్ద రైలు ఆగి ఉండగా ఈ వీడియో తీశారు. వైరల్ అయిన ఆ సమాచారం తప్పుదారి పట్టించేలా ఉందని రైల్వే శాఖ పేర్కొంది. వీడియోలో కనిపించిన రైలు ఇండోర్-మౌ DEMU ప్యాసింజర్ సర్వీస్ కాదు, అది ఒక గూడ్స్ రైలు అని తెలిపింది. ‘రౌ’ యార్డ్‌లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల కారణంగా ఆ రైలును ‘రౌ హోమ్ సిగ్నల్’ వద్ద నిలిపి ఉంచారని స్పష్టం చేసింది. సమోసాలు, కచోరీలు కొంటూ కనిపించిన వ్యక్తి అసిస్టెంట్ లోకో పైలట్ అని, ట్రాక్ నిర్వహణ పనుల వల్ల రైలు అప్పటికే ఆగి ఉన్న సమయంలో, నిర్ణీత విరామ సమయంలోనే ఆయన బయటకు వచ్చారని రైల్వే శాఖ (Railway Department) తెలిపింది. ఆహారం కొనడం కోసం రైలును ఆపలేదని, సరైన సందర్భం తెలియకుండానే వీడియోను షేర్ చేయడం వల్ల అల్పాహారం కోసం ప్యాసింజర్ రైలును ఉద్దేశపూర్వకంగా ఆపారనే తప్పుడు అభిప్రాయం కలిగిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Shopian Encounter | కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం