Vijay Congress Support | తమిళనాడులో విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక చర్చలు!

Naresh Chandan
Vijay Congress Support

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Congress Support | తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన నటుడు-రాజకీయ నాయకుడు విజయ్. తన పార్టీ Tamilaga Vettri Kazhagam (TVK)తో ఆయన భారీ విజయాన్ని నమోదు చేశారు. తాజా ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలవడం వల్ల మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది.

తమిళనాట మ్యాజిక్​ ఫిగర్​ 118. కాంగ్రెస్​ 5 స్థానాలు గెలుచుకుంది. దీంతోపాటు సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 స్థానాలు గెలుచుకున్నాయి. వీటి మద్దతు గనుక విజయ్​ లభిస్తే.. ఆయన తేలికగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు.

Vijay Congress Support | చర్చలకు సిద్ధమని సూచించడం

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుందని తేలడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌ అయింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేతలు సైతం “మార్పునకు ప్రజలు మద్దతు ఇచ్చారు” అని వ్యాఖ్యానించడం, మద్దతు అంశంపై చర్చలకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ “కింగ్‌మేకర్” పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Vijay Congress Support | ఒంటరిగా పోటీ..

విజయ్ మొదటి నుంచి “ఎలాంటి పొత్తులు లేకుండా” పోటీలో నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రం వ్యూహాత్మకంగా మిత్రపక్షాల మద్దతు తీసుకునే పరిస్థితి తప్పడంలేదు. అవసరమైతే విస్తృత కూటమి ఏర్పాటుపై సైతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

తాజా ఎన్నికల ఫలితాలతో దశాబ్దాలుగా DMK–AIADMK ఆధిపత్యానికి విజయ్ దీటుగా ఎదిగారు. యువత, తక్కువ ఆదాయ వర్గాల నుంచి భారీ మద్దతు రావడం విజయ్​ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Vijay Congress Support | మద్దతు ఇవ్వబోమని..

సర్కారు ఏర్పాటు కోసం గడువు తక్కువగా ఉండటంతో, విజయ్ కీలక సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు సమీకరణలపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతు సైతం విజయ్​కి కీలకంగా మారింది. కానీ, కొన్ని పార్టీలు మాత్రం స్పష్టంగా మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం అనిశ్చితిని పెంచుతోంది.

మొత్తానికి, తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు దొరకనున్నాయి.

India IT Rules | “సెన్సార్‌షిప్‌” అసంపూర్ణ వాదన.. ఐటీ నిబంధనలపై విమర్శలకు భారత రాయబారి కౌంటర్‌!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *