Chinese Crackers Seized | చెన్నై పోర్టులో భారీగా టపాసులు సీజ్​

చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న క్రాకర్స్​ను అధికారులు సీజ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chinese Crackers Seized | చెన్నై (Chennai) పోర్టులో భారీగా చైనా బాణాసంచాను డీఆర్‌ఐ అధికారులు సీజ్​ చేశారు. వీటిని అక్రమంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.

దీపావళీ వేడుకలకు ముందు పెద్ద ఎత్తున క్రాకర్స్​ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో చెన్నై పోర్టులో నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తీసుకొచ్చిన టపాసులను సీజ్​ చేశారు. స్టేషనరీ, మెడికల్ గ్లౌజులు, ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలు వంటి సరుకుల పేరుతో వీటిని దిగుమతి చేసుకున్నారు. కంటైనర్లలో ముందు ఆ సామగ్రి పెట్టి వెనుకాల దాచి ఉంచిన బాణసంచాను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బాణాసంచా విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Chinese Crackers Seized | టపాసుల దిగుమతిపై ఆంక్షలు

విదేశీ వాణిజ్య విధానం ప్రకారం క్రాకర్స్​ దిగుమతిపై ఆంక్షలు ఉన్నాయి. వీటికి, పేలుడు పదార్థాల నియమాలు-2008 ప్రకారం అనుమతులు అవసరం. అయితే లైసెన్సులు లేకుండా.. ఇతర వస్తువుల పేరుతో చైనా నుంచి కొందరు టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి సీజ్​ చేశారు.

ఇది కూడా చదవండి: Lucknow Airport Fire | లక్నో ఎయిర్‌పోర్టు వద్ద భారీ అగ్నిప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *