BJP District President Arrested | బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అరెస్ట్​..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BJP District President Arrested | బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీజీహెచ్​ మార్చురి వద్ద ఆందోళన చేస్తున్న ఆయనను అరెస్ట్​ చేసి వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

BJP District President Arrested | బాధితులకు న్యాయం చేయాల్సిందే..

భీమ్​గల్​ పోలీస్​స్టేషన్​ ఆవరణలో ఆత్మహత్యయత్నం చేసిన సుధాకర్​ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి మంగళవారం ఉదయం జీజీహెచ్​ మార్చురికి వచ్చారు. సుధాకర్ మృతదేహాన్ని పరిశీలంచిన అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: Sudhakar Death | భీమ్​గల్​ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్​వాలా మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *