అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sudhakar Death | నిజామాబాద్ Nizamabad లోని భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్‌వాలా సుధాకర్ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Sudhakar Death | పలువురు వేధిస్తున్నారని కారణంతో..
పలువురు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సదరు టీ స్టాల్ యజమాని సుధాకర్ సోమవారం ఉదయం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పుటించుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.
Sudhakar Death | కలకలం రేపుతున్న బాధితుడి వీడియో
ఆత్మహత్యాయత్నం అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడు సుధాకర్ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ‘పోలీసులు నన్ను విపరీతంగా వేధిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జరిమానాలు చెల్లించాను. నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను’ అని బాధితుడు ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Sudhakar Death | సీపీ సాయి చైతన్య వివరణ..
సుధాకర్ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని సీపీ సాయి చైతన్య సోమవారం వివరణ ఇచ్చారు. భీమ్‌గల్ పట్టణవాసి సుధాకర్ బస్టాండ్ సమీపంలో టీ స్టాల్ నడుపుతున్నాడు. అయితే అతడి షాప్‌నకు ఎదురుగా ఉన్న కిరాణాషాప్‌లో సుధాకర్ సిగరెట్లు కొనడం లేదని.. ఆ షాప్ యజమాని ఇద్దరు విలేకరులను పంపించి ఆయనను బెదిరించారన్నారు.
అలాగే సుధాకర్ టీస్టాల్ రాత్రి 10.30 తర్వాత కూడా తెరిచి ఉండటంతో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా చూసి పీటీ కేసు పెట్టినట్లు సీపీ తెలిపారు. విలేకరులు బెదిరించిన అంశాన్ని మనసులో పెట్టుకున్న సుధాకర్ సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆవరణలో నిప్పంటించుకున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు.