Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే

వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Crop Bonus | వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) డిమాండ్​ చేశారు. ఎల్​నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

Crop Bonus | సాధారణం కంటే తక్కువ వర్షపాతం

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్​నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచిస్తుంది కానీ.. రాష్ట్రంలో వరి పంటకు బోనస్ ప్రకటించడంతో రైతులు వరిపైనే ముగ్గు చూపుతున్నారన్నారు. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని సూచించారు.

ప్రధానంగా రైతులు సజ్జలు, కందులు, కొర్రలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వాటిపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్​లో నీళ్లు సరిపడా లేని విషయం తెలిసిందేనన్నారు. కాళేశ్వరం నుంచి హల్దీ వాగుకు నీటిని లిఫ్ట్ చేసి నిజాంసాగర్​ను నింపాలన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *