Kamareddy Police | వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి బయటకు వెళ్లగా.. పోలీసులు సమయస్ఫూర్తితో ఎట్టకేలకు అతడికి కాపాడారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి బయటకు వెళ్లపోయాడు.. సమాచారం అందుకున్న పోలీసులు సమయస్ఫూర్తితో ఎట్టకేలకు అతడిని కాపాడారు.

Kamareddy Police | కామారెడ్డి పట్టణంలో..

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. వారు వెంటనే కామారెడ్డి పోలీసు సిబ్బంది, బీట్​ కానిస్టేబుల్ అరుణ్​తో పాటు ఇతర సిబ్బంది వెంటనే గాలింపు చేపట్టారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం అమూల్యమైనదని, ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఆపదలో ఉన్నవారు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. మానసిక ఒత్తిడి లేదా నిరాశతో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Navodaya Admissions | ‘నవోదయ’లో ప్రవేశాలకు వేళాయే.. కార్పొరేట్​కు సరితూగేలా విద్యాబోధన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *