JNTU Lizard Incident | కూరలో బల్లి కలకలం.. జేఎన్టీయూలో విద్యార్థుల ఆగ్రహం..

హైదరాబాద్​లోని ప్రముఖ జవహర్​ లాల్​ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో గల ఓ హాస్టల్​లో వండిన కూరలో బల్లి రావడం కలకలం రేపింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: JNTU Lizard Incident | హైదరాబాద్​ (Hyderabad)లోని ప్రముఖ జవహర్​ లాల్​ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో గల ఓ హాస్టల్​లో వండిన కూరలో బల్లి రావడం కలకలం రేపింది. క్యాంపస్​లోని మంజీర బాలుర హాస్టల్లో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసేందుకు వెళ్లారు. మెస్​లో వండిన కూరలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తోటి విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో వారు మెస్​కు చేరుకున్నారు. కర్రీలో బల్లి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

JNTU Lizard Incident | మెస్ నిర్వాహకులపై విద్యార్థులు ఫైర్..

రాత్రి డిన్నర్ చేసేందుకు హాస్టల్ మెస్​కు వెళ్లిన విద్యార్థులకు కూరలో బల్లి కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థులు ఆ భోజనం తినేశారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. మెస్​లో భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్వాహకుల అలసత్వంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూమ్ రెంట్లు, మెస్ ఛార్జీలు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు.. నాణ్యతను మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు.

JNTU Lizard Incident | మెస్​ ప్రాంగణంలో ఆందోళన

మెస్​ నిర్వహణ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatodaytelugu)

ఇది కూడా చదవండి..: PAANI App | నీటి దుర్వినియోగానికి చెక్​.. ‘పానీ’ యాప్​ ప్రారంభించిన మంత్రి పొన్నం

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *