అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deputy Collector Arrest | డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అధికారులు మళ్లీ అరెస్ట్ చేశారు. వంశీమోహన్ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
వంశీ మోహన్ బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. గచ్చిబౌలి (Gachibowli)లోని వంశీ మోహన్ ఫ్లాట్‌లో రూ.56 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. రెండు ఫ్లాట్స్‌ను బలవంతంగా తన పేరుపై రాయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మరోసారి ఆయనను అరెస్ట్ చేశారు.
Deputy Collector Arrest | భారీగా అక్రమాస్తులు
మేడ్చల్-మల్కాజిగిరి (Medchal) జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా వంశీమోహన్ పని చేస్తున్నారు. 2019 నుంచి 2023 వరకు ఆయన శేరిలింగంపల్లి (Serilingampally) తహశీల్దార్‌గా పని చేశాడు. ఆ సమయం నుంచి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ సమాచారం అందింది. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు మే నెలలో సోదాలు చేశారు. ఆ సమయంలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 19 ఓపెన్ ప్లాట్స్ డాక్యుమెంట్లు, ఎన్జీవో కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు, మణికొండ, మజీద్‌బండలో ఒక్కో ఫ్లాట్, ఇబ్రహీంపట్నం నర్రెపల్లిలో రెండు ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉన్నట్టు గుర్తించారు. 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, కియా కార్లను గుర్తించినట్టు వెల్లడించారు.
దీనినిక కూడా చదవండి : Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి