Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఒక చిన్న బ్యాటరీ ఫ్యాన్ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొనుక్కున్న వస్తువే ఆ బాలుడికి తీవ్ర గాయాన్ని మిగిల్చింది.

Battery Fan Blast| అసలు ఏం జరిగిందంటే?..

రాజిపేట గ్రామానికి చెందిన శివతేజ్ అనే నాలుగవ తరగతి విద్యార్థి, ఎండల తీవ్రత దృష్ట్యా స్థానిక దుకాణంలో చేతితో పట్టుకునే (Handheld) ఒక చిన్న బ్యాటరీ ఫ్యాన్‌ను కొనుగోలు చేశాడు. ఆ ఫ్యాన్‌ను వాడుతున్న సమయంలో ఒక్కసారిగా అందులోని బ్యాటరీ భారీ శబ్దంతో పేలిపోయింది.ఈ ప్రమాద ధాటికి బాలుడి ఎడమ చేతికి ఉన్న నాలుగు వేళ్లు తెగిపడ్డాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు విలవిలలాడిపోయాడు.

Battery Fan Blast| చికిత్స..

ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మార్కెట్‌లో విక్రయిస్తున్న నాణ్యత లేని బ్యాటరీ వస్తువుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Reels Accident | ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి .. ఒకరు మృతి.. ఇద్దరిని హెలికాప్టర్‌లో కాపాడిన ఎయిర్‌ఫోర్స్!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *