NTPC Jobs 2026 | ఎన్టీపీసీలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ. 55 వేలపైనే వేతనం!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: NTPC Jobs 2026 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఎన్టీపీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్ లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టు పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్

భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య : 250.

రిజర్వేషన్ల వారీగా పోస్టులు : జనరల్ 109, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 39, ఎస్సీ 42, ఎస్టీ 35.

వయో పరిమితి : 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

NTPC Jobs 2026 | అర్హతలు..

మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీ లేదా బీ.టెక్ డిగ్రీ కలిగి ఉండాలి. కనీసం 40 శాతం మార్కులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, పీడ్ల్యూబీడీ కేటగిరిలో పాస్ మార్కులు ఉన్నా అప్లై చేసుకోవచ్చు.

పని అనుభవం : కనీసం ఒక సంవత్సరం పవర్ ప్లాంట్ ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్‌లో పని అనుభవం అవసరం. ప్లాంట్ సామర్థ్యం 40 మెగావాట్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

వేతనం : రూ. 55 వేలు. అదనంగా హెచ్ ఆర్ ఏ లేదా కంపెనీ అకామిడేషన్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..

NTPC Jobs 2026 | దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మే 7 మే దరఖాస్తుకు చివరి తేదీ. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగం ఉంటుంది. ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్‌లలో పరికరాల ఆపరేషన్, సేఫ్టీ, మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.ntpc.co.in లేదా careers.ntpc.co.in లో సంప్రదించగలరు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *