అక్షరటేడే వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత చేస్తున్న సాహసాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం రీల్స్ షూట్ చేయడం కోసం ఐదుగురు యువకులు ఒక పాత నీటి ట్యాంక్‌పైకి ఎక్కారు. అయితే, పని ముగించుకుని కిందకు దిగుతున్న సమయంలో పురాతనమైన ఆ ట్యాంక్ మెట్లు ఒక్కసారిగా విరిగిపోయాయి.
Reels Accident|ప్రమాదం జరిగిన తీరు..
మెట్లు విరగడంతో ముగ్గురు యువకులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కిందపడిన మిగిలిన ఇద్దరు (షాని, గోలు) తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెట్లు కూలిపోవడంతో పవన్, కల్లు అనే మరో ఇద్దరు యువకులు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఫైర్ సిబ్బంది వారి వద్దకు చేరుకోలేకపోయారు.
Reels Accident|భారత వాయుసేన..
యువకులు రాత్రంతా ట్యాంక్ పైనే ప్రాణభయంతో గడపడంతో, అధికారులు భారత వాయుసేన (IAF) సహాయాన్ని కోరారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు చెందిన MI-17 V5 హెలికాప్టర్ ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు 16 గంటల పాటు ట్యాంక్‌పై చిక్కుకున్న ఆ ఇద్దరు యువకులను వాయుసేన సిబ్బంది చాకచక్యంగా రక్షించి, హెలికాప్టర్ ద్వారా గోరఖ్‌పూర్‌కు తరలించారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: TVK Resort Politics | తమిళనాట ‘రిసార్ట్’ రాజకీయాలు షురూ.. ఫలితాలకు ముందే అలర్ట్ అయిన టీవీకే అధ్యక్షుడు విజయ్

