Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

ఆర్​ఎస్​ఎస్ ​ చీఫ్​ మోహన్​ భగవత్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలపడంతో 'జెన్-జెడ్' యువత దేశ వ్యతిరేకులు కారన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat Gen Z | ఆర్​ఎస్​ఎస్ (RSS)​ చీఫ్​ మోహన్​ భగవత్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలపడంతో ‘జెన్-జెడ్’ (Gen Z) యువత దేశ వ్యతిరేకులు కారన్నారు. గురువారం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

జెన్ జెడ్ యువత మన వాళ్లు అని, వారు నిరసనలు చేస్తుంటే ఆందోళనలను పరిష్కరించాలని మోహన్​ భగవత్​ అన్నారు. జెన్ జెడ్ ఆందోళన చేస్తుంటే, వారు ఖచ్చితంగా దేశద్రోహులు కారని పేర్కొన్నారు. వారు మన తర్వాతి తరం అన్నారు. ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర, భారతీయ పద్ధతిలో అనే సదస్సులో ఆయన ప్రసంగించారు.

rss

Mohan Bhagwat Gen Z | కొన్ని పద్ధతులు ఉంటాయి

జెన్ జెడ్ నిరసనలు చేయకూడదని తాను చెప్పనని ఆర్ఎస్​ఎస్​ చీఫ్​ పేర్కొన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీ (Delhi)లోని జంతర్​ మంతర్​ వద్ద ఇటీవల కాక్రోచ్​ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్​ జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. నిరసనకారులు యాంటీ నేషనల్స్ అని, వారికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జెన్-జెడ్ (Mohan Bhagwat Gen Z |) గట్టిగా గళమెత్తుతున్నప్పుడు, అది కేవలం నిరసన కోసం కాదని మనం గుర్తించాలన్నారు. వారికి ఏదో సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాలని వారు అలా చేస్తున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి : MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *