అక్షరటుడే వెబ్‌డెస్క్: Swiggy Delivery Partners | ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం ‘స్విగ్గీ’ హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించింది. కేర్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్, ఇన్‌స్టామార్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది డెలివరీ పార్ట్నర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ కార్యక్రమాల విభాగం సెక్రటరీ శ్రీమతి హరి చందన దాసరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డెలివరీ భాగస్వాములకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
Swiggy Delivery Partners | ఉచిత ఆరోగ్య పరీక్షలు..
ఈ క్యాంపులో కేర్ హాస్పిటల్స్ ( Care Hospital ) వైద్య నిపుణులు డెలివరీ భాగస్వాములకు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, పల్స్, బ్లడ్ షుగర్, బరువుతో పాటు డాక్టర్ల సిఫారసు మేరకు ఈసీజీ పరీక్షలు చేశారు. అలాగే ఆప్తమాలజీ (కంటి పరీక్షలు), డెంటల్ (దంత వైద్యం) పరీక్షలతో పాటు, న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలో బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ (BCA) వెల్నెస్ అంచనాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీమతి హరి చందన దాసరి మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో, ఆర్థిక వ్యవస్థలో డెలివరీ భాగస్వాముల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి సంక్షేమం, ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.
Swiggy Delivery Partners | భాగస్వాముల సంక్షేమమే మా లక్ష్యం..
స్విగ్గీ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేహా సింఘ్వి మాట్లాడుతూ.. రోజూ మన జీవితాల్లో భాగమవుతున్న డెలివరీ భాగస్వాములకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కేవలం ఉద్యోగ భద్రతే కాకుండా, వారి ఆర్థిక ప్రగతి కోసం స్విగ్గీ పలు సంక్షేమ చర్యలు చేపడుతోందని గుర్తుచేశారు.
Swiggy Delivery Partners | ఇతర సంక్షేమ కార్యక్రమాలు..
స్విగ్గీ భాగస్వాముల సంక్షేమం కోసం పలు ఆర్థిక భద్రతా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జెరోధా ఫండ్ హౌస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, డెలివరీ పార్ట్నర్లు కేవలం రూ. 100 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కల్పించింది. అలాగే, యాప్ ద్వారా 50 వేలకు పైగా భాగస్వాములు ఐటీఆర్ (ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్) దాఖలు చేయడానికి సహకరించడంతో పాటు, సుమారు రూ. 6.5 కోట్ల పన్ను రిఫండ్లు పొందేలా చేసింది. అంతేకాకుండా, అత్యవసర ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు అర్హులైన భాగస్వాములు తమ సంపాదనను సాధారణ వారపు చెల్లింపు చక్రంతో సంబంధం లేకుండా ముందుగానే పొందేలా (అడ్వాన్స్ పేమెంట్స్) ముందస్తు చెల్లింపుల సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: Sthree Nidhi Electric Autos | మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ