Spotify India Campaign | రోజూవారీ పనులకు సంగీతంతో జోష్.. స్పాటిఫై కొత్త ప్రచారం అదుర్స్!

ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం వంటి బోర్ కొట్టే రోజువారీ పనులను కూడా ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చంటోంది ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'స్పాటిఫై'.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Spotify India Campaign | ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం వంటి బోర్ కొట్టే రోజువారీ పనులను కూడా ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చంటోంది ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్పాటిఫై’. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మన దినచర్యలను ఎంతగానో మారుస్తుందనే సరికొత్త సందేశంతో స్పాటిఫై ఒక ఆసక్తికరమైన ప్రచారానికి తెరతీసింది.

Spotify India Campaign | సరదా సన్నివేశాలతో ..

“రోజ్ కే కామ్ ఫన్ బనావో, స్పాటిఫై చలావో” నినాదంతో ఈ కొత్త క్యాంపెయిన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలు, గిన్నెలు తోముతూ పాటలకు లయబద్ధంగా ఊగిపోయే రూమ్‌మేట్స్ వంటి విభిన్న గృహ నేపథ్యాల సన్నివేశాలతో కూడిన 8 చిత్రాల సిరీస్‌ను విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, భోజ్‌పురి సహా ఐదు భాషల్లో టీవీ, డిజిటల్, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఐదు వారాల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది.

Spotify India Campaign | జోరుగా సంగీత శ్రవణం..

నగరవాసులు తమ దినచర్యలో సంగీతానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడి శ్రవణ అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల స్పాటిఫై విడుదల చేసిన హైదరాబాద్ టాప్ సాంగ్స్ జాబితాలో ‘యేషనాగుల’, ‘మల్లెపూల పల్లకి’, ‘నేనో బటర్‌ఫ్లై’ వంటి తెలుగు పాటలు అగ్రస్థానంలో నిలిచి శ్రోతలను అలరిస్తున్నాయి.

Spotify India Campaign | మానసిక ప్రశాంతత..

స్పాటిఫై నిర్వహించిన పరిశోధన ప్రకారం.. 97% మంది భారతీయులు సాధారణ పనులను ఆనందదాయకంగా మార్చడంలో స్పాటిఫై దోహదపడుతుందని తెలిపారు. 98% మంది ఇది తమ దినచర్యలో భాగమని పేర్కొనగా, 71% మంది ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నప్పుడు రిలాక్స్‌డ్‌గా ఫీలవుతున్నట్లు వెల్లడించారు.

Spotify India Campaign | పెరుగుతున్న ఆదరణ..

స్పాటిఫై తాజా ‘లౌడ్ & క్లియర్’ నివేదిక ప్రకారం.. 2025లో భారతీయ కళాకారుల పాటలు దాదాపు 335 బిలియన్ సార్లు స్ట్రీమ్ అయ్యాయి. ఇది మొత్తం 20 బిలియన్ గంటలకు పైగా సంగీతానికి సమానం. ముఖ్యంగా తెలుగు కళాకారుల రాయల్టీలు ఏడాదికి ఏడాది 120%కి పైగా పెరగడం విశేషం. ఏ పని చేస్తున్నా, ఏ భాష మాట్లాడుతున్నా.. సరైన పాట తోడుంటే ఆ క్షణం  అనుభవమే మారిపోతుందని స్పాటిఫై ఇండియా (  India ) మార్కెటింగ్ హెడ్ షిప్రా శ్రీవాస్తవ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sthree Nidhi Electric Autos | మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *