బిజినెస్​Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే.. రూ. 11 లక్షల కోట్ల సంపద...

Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే.. రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,456 పాయింట్లు, నిఫ్టీ 436 పాయింట్లు కోల్పోయాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | అమెరికా -ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ముడిచమురు ధరలకు కళ్లెం పడడం లేదు. ఇరుపక్షాలు శాంతి ఒప్పదానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లలో భయాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ప్రధాని మోదీ (Prime Minister Modi) పొదుపు చర్యలు ప్రకటన, గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండడం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగిస్తుండడం, రూపాయి బలహీనత కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.

Stock Market Losses | రోజంతా నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం సెన్సెక్స్ 327 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 53 పాయింట్లు పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడితో 1,292 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 35 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 409 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 1,456 పాయింట్ల నష్టంతో 74,559 వద్ద, నిఫ్టీ 436 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి

అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 4.11 శాతం, ఐటీ ఇండెక్స్ 3.73 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.35 శాతం, యుటిలిటీ 2.94 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.85 శాతం, మీడియా 2.77 శాతం, పవర్ 2.61 శాతం, ఆటో 2.28 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.14 శాతం నష్టాలతో ముగిశాయి.

Stock Market Losses  అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 869 కంపెనీలు లాభపడగా 3,412 స్టాక్స్ నష్టపోయాయి. 129 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 93 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 11 ýక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Stock Market Losses | ఒకే ఒక్కటి..

బీఎస్ ఈ సెన్సెక్స్‌లో ఒకే ఒక్క స్టాక్ లాభపడగా.. 29 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్ బీఐ 0.12 శాతం పెరిగింది.
టెక్ మహీంద్రా 4.44 శాతం, అదానీపోర్ట్స్ 4.39 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.11 శాతం, టీసీఎస్ 3.84 శాతం, టైటాన్ 3.60 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tanuja Murder Case| ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tanuja Murder Case|హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజా...

Nizamabad Child Death | నిజామాబాద్‌లో విషాదం..వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Child Death | తల్లిదండ్రులు తమ తమ...

Kamareddy District Court | గంధపు చెట్లపై ఆశతో భూ యజమాని హత్య.. కౌలురైతుకు జీవిత ఖైదు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District Court | ఆస్తిపై ఆశతో కౌలు...

ONGC Share Price | రాయల్టీ రేట్ తగ్గించిన కేంద్రం.. పరుగులు తీసిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ONGC Share Price |భారతదేశంలో అప్‌స్ట్రీమ్ అన్వేషణ,...