అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyundai New SUV | ఆటోమొబైల్ రంగ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండు సరికొత్త ఎస్‌యూవీ (SUV)లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం యూరోప్‌లో అందుబాటులో ఉన్న ‘బేయన్’పై ఆధారపడిన మిడ్ సైజ్ ఎస్‌యూవీతోపాటు స్థానికంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్యనున్న భారీ ధర, సైజు వ్యత్యాసాన్ని భర్తీ చేయడం కోసం వీటిని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మారుతి సుజుకీ విక్టోరస్ (Maruti Suzuki Victorious) , ఫ్రాంక్స్ , టయోటా టైసార్ కార్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ మోడల్ గురించి అందుబాటులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
లుక్ : ఈ హ్యుందాయ్ (Hyundai) బేయన్ ఆధారిత ఎస్‌యూవీ 4.2 మీటర్ల పొడవుతో రానుంది. హ్యుందాయ్ లేటెస్ట్ ‘సెన్సువస్ స్పోర్టినెస్’ డిజైన్ లాంగ్వేజ్‌తో, బాక్సీ ఆకారంలో మరింత ఎత్తుగా కనిపించనుంది.
ఫీచర్లు : స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హై మౌంటెడ్ డీఆర్ఎల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇవ్వనున్నాయి. 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లతో రానుంది.
Hyundai New SUV | డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ..
హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఈ ‘బీసీ4ఐ’ (కోడ్ నేమ్) ఎస్‌యూవీలో తొలిసారి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ సెటప్ అమర్చుతున్నారు. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న హ్యుందాయ్ కార్లలో సీఎన్జీ వేరియంట్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదే.. ఇందులో టాటా కార్ల తరహాలో ‘డ్యూయల్ సిలిండర’ సెటప్ ఉండనుంది. దీంతో బూట్ స్పేస్ ఎక్కువ లభిస్తుంది.
Hyundai New SUV | ఇంజిన్, ట్రాన్స్‌మిషన్..
ఈ ఎస్‌యూవీలో వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.
1.5ఎల్ పెట్రోల్ ఇంజిన్.. 114 బీహెచ్‌పీ పవర్, 144 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేస్తారని తెలుస్తోంది.
టర్బో పెట్రోల్ ఇంజిన్.. 1.5ఎల్ టర్బో లేదా సరికొత్త 1.2 ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది.
భద్రత : ఇందులో అత్యాధునిక ఇంటీరియర్‌తో పాటు అత్యున్నత భద్రత కోసం అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను చేర్చనున్నారు.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు..

