Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Slaughter Ban | గోవధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని వీహెచ్​పీ (VHP Yellareddy), బజరంగ్​దల్(Bajrang Dal) కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో మంగళవారం గోవధ చట్టాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Cow Slaughter Ban | 1977లో గోవధ నిషేధ చట్టం..

ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1977లో తీసుకొచ్చిన గోవధ నిషేధ చట్టాన్ని(Cow Slaughter Prohibition Act) కఠినంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆక్రమణల్లో ఉన్న ఆలయ భూములకు వెంటనే విముక్తి కల్పించాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే గోశాలలను ఏర్పాటు చేయాలని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న గోవధశాలలను తక్షణమే మూసివేయించాలని కోరారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో(Telangana Assembly) తీర్మానం చేయాలని, గో ఆధారిత వ్యవసాయదారులకు సబ్సిడీలు ఇవ్వాలని వీహెచ్‌పీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా గోరక్ష ప్రముఖ్ తులసీదాస్, త్రీ ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు నవీన్, హరిబాబు, రాహుల్, హర్ష, పురుషోత్తం, యాదగిరి, విద్యాసాగర్, రాజ్ కుమార్, నవీన్​తో పాటు పలువురు హిందూ బంధువులు, చిన్నలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *