Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త హనుమాన్ మూల మలుపు (కళ్యాణి ప్రాజెక్టు) (Kalyani Project) సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

Yellareddy Road Accident | ధ్వంసమైన కారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) జిల్లా నస్రుల్లాబాద్​ గ్రామానికి చెందిన దండ్ల నాగరాజు హైదరాబాద్ (Hyderabad) నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు (Yellareddy Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *