May 22 Gold rates | బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన ధర

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 22 Gold rates | గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు Gold Rates మరోసారి పెరగడం మొద‌లు పెట్టాయి. వరుసగా మూడో రోజు కూడా ధరలు పెరగడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు నిరాశకు గురవుతున్నారు.

May 22 Gold rates | 24 క్యారెట్​ పసిడి ధర..

దేశీయ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా నమోదైంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,85,100 వద్ద ఉంది.

May 22 Gold rates | అంతర్జాతీయ పరిస్థితులు..

బంగారం ధరలు కేవలం స్థానిక మార్కెట్ డిమాండ్‌పైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

దీంతో చాలామంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు Stock Markets బదులుగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు.

ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. దీని ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్‌పై పడుతోంది. ఫలితంగా బంగారం ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళలో Kerala 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉంది.

చెన్నైలో మాత్రం అత్యధికంగా రూ.1,61,680గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,200గా కొనసాగుతోంది.

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల ధోరణిని బట్టి బంగారం ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

AP FDC ఛైర్మన్​గా భరత్ భూషణ్.. వైస్ ఛైర్మన్​గా మెహర్ రమేష్.. డైరెక్టర్లుగా మరో 14 మంది నియామకం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *