అక్షరటుడే వెబ్‌డెస్క్: Godrej Gateway Returnship Program | గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ (DEI) విభాగం ‘గోద్రెజ్ డీఈఐ ల్యాబ్’ (Godrej DEI Lab), వివాహం, తల్లులుగా మారడం, సంరక్షణ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన అనుభవజ్ఞులైన మహిళా నిపుణులు తిరిగి ఉద్యోగంలోకి ప్రవేశించడానికి వీలుగా ‘గేట్‌వే’ (Gateway) అనే ప్రత్యేక రిటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోద్రెజ్ వర్క్‌ఫోర్స్‌లో నైపుణ్యం కలిగిన మహిళలను నిలుపుకోవడానికి , ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతం గోద్రెజ్ ఇండస్ట్రీస్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు 30% ప్రాతినిధ్యం కలిగి ఉండగా, 2031 నాటికి మహిళలు, ఎల్‌జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) వ్యక్తులు , దివ్యాంగుల భాగస్వామ్యాన్ని 40 శాతానికి పెంచాలని గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.
Godrej Gateway Returnship Program | గ్రాండ్ ఫినాలే వేదికగా..
ఈ ‘గేట్‌వే’ కార్యక్రమాన్ని భారతదేశంలోని అగ్రశ్రేణి బి-స్కూల్స్ కోసం నిర్వహించిన ప్రతిష్టాత్మక కేస్ స్టడీ పోటీ ‘ఇండియా ( India ) ఇంక్లూడెడ్ ఆన్ క్యాంపస్’ (India Included on Campus) రెండో ఎడిషన్ గ్రాండ్ ఫినాలే వేదికగా ప్రకటించారు. 2025లో ప్రారంభమైన ఈ పోటీల విజయవంతమైన ప్రయాణం తర్వాత, ఈ ఏడాది IIM లక్నో, IIT ఢిల్లీ, XIM భువనేశ్వర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), IIT బాంబే, SIBM పుణే, TISS ముంబై , IIM ట్రిచీ వంటి 8 ప్రముఖ బి-స్కూల్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. వందలాది మంది విద్యార్థులు మహిళల వర్క్‌ఫోర్స్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం , వారు తిరిగి ఉద్యోగంలో చేరే సమయంలో ఎదుర్కొనే అడ్డంకులను తొలగించే పరిష్కారాలపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
Godrej Gateway Returnship Program | విజేతగా నిలిచిన XIM భువనేశ్వర్..
ఐఐఎం లక్నో, ఐఐటీ ఢిల్లీ, ఎక్స్‌ఐఎం భువనేశ్వర్, ఎస్‌ఐబీఎం పుణే జట్లు ఫైనల్స్ పోటీలకు చేరుకున్నాయి. కెరీర్ బ్రేక్ తర్వాత మహిళలు తిరిగి కార్యరంగంలోకి ప్రవేశించడానికి ఒక చక్కటి నిర్మాణపరమైన మార్గాన్ని (structured returnship pathway) సూచించిన XIM భువనేశ్వర్ జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయవంతమైన జట్టుకు రూ. 1,00,000 నగదు బహుమతితో పాటు గోద్రెజ్ సీనియర్ నాయకత్వంతో సంభాషించే అవకాశం లభించింది.
Godrej Gateway Returnship Program | నాయకుల స్పందన..
ఇటీవలి అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 74% మంది విద్యావంతులైన మహిళలు తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో కెరీర్ బ్రేక్ తీసుకుంటున్నట్లు తేలింది. చాలా మంది తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆశించినప్పటికీ సరైన మార్గం దొరకక ఇబ్బంది పడుతున్నారు. ‘గేట్‌వే’ కార్యక్రమం ద్వారా ఆ అంతరాన్ని పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ కార్పొరేట్ సర్వీసెస్ గ్రూప్ హెడ్ సుమిత్ మిత్రా మాట్లాడుతూ, “కెరీర్ బ్రేక్ అనేది కెరీర్ గమనాన్ని మార్చవచ్చు కానీ అది అంతం కాకూడదు” అని పేర్కొన్నారు. గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ హెడ్ పర్మేష్ షాహాని మాట్లాడుతూ, తతరాలుగా వ్యాపార నాయకులుగా ఎదిగే విద్యార్థులలో సమగ్రతను తీసుకురావడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు