అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | వరుసగా రెండు రోజులపాటు భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. శుక్రవారం కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో పైకి ఎగబాకాయి. ఐటీ షేర్ల మద్దతుతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి.
Stock Market Rally | నష్టాల పరంపరకు బ్రేకులు..
మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. గ్లోబల్ మార్కెట్లనుంచి అందిన సానుకూల సంకేతాలతోపాటు కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎనిమిది వారాల నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. ఎనిమిది వారాల తర్వాత ఈ వారాన్ని లాభాలతో ముగించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతం మేర పెరిగాయి.
Stock Market Rally | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మొదట్లో 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 930 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 20 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 286 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 879 పాయింట్ల లాభంతో 72,472 వద్ద, నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 22,520 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,516 కంపెనీలు లాభపడగా 1,867 స్టాక్స్ నష్టపోయాయి. 227 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 113 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 262 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
ఒకే ఒక్కటి..
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో రిలయన్స్ మినహా మిగిలిన అన్ని కంపెనీలు లాభాలతో ముగిశాయి. రిలయన్స్ మాత్రమే 0.55 శాతం మేర నష్టపోయింది. ఐటీసీ 4.78 శాతం, టీసీఎస్ 4.23 శాతం, అదానీపోర్ట్స్ 3.36 శాతం, ఇన్ఫోసిస్ 3.01 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.84 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. భారీ లాభాల్లో సూచీలు