అక్షరటుడే వెబ్‌డెస్క్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటైన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (PNB Housing Finance) మరో ప్రతిష్టాత్మక మైలురాయిని సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ (CRISIL) కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘CRISIL AA+/Stable’ నుంచి ‘CRISIL AAA/Stable’ స్థాయికి పెంచినట్లు ప్రకటించింది.
తాజా క్రిసిల్ అప్‌గ్రేడ్‌తో కలిపి దేశంలోని నాల్గు ప్రముఖ దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ‘AAA’ (ట్రిపుల్ ఏ) రేటింగ్స్ సాధించినట్లయింది. గడచిన 12 నెలల వ్యవధిలో క్రిసిల్, ఇండియా ( India )రేటింగ్స్, కేర్ రేటింగ్స్ , ఇక్రా (ICRA) వంటి నాలుగు సంస్థలు కంపెనీకి అత్యున్నత ‘AAA’ రేటింగ్స్ ఇవ్వడం విశేషం.
PNB Housing Finance AAA Rating | రేటింగ్ పెరగడానికి..
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్ మెరుగుపడటానికి ప్రధానంగా కొన్ని బలమైన అంశాలు దోహదపడ్డాయి. కంపెనీ అసెట్ క్వాలిటీ మెరుగవ్వడం, బలమైన మూలధన స్థిరత్వం, లాభదాయకత పెరగడం వంటి ఆర్థిక అంశాలు ఈ రేటింగ్ వృద్ధికి గట్టి పునాది వేశాయి. అలాగే గృహ రుణాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడం , రిటైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా కంపెనీ వ్యాపార విధానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
PNB Housing Finance AAA Rating | బలమైన మద్దతు
మరోవైపు మాతృ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి లభిస్తున్న బలమైన మద్దతు, వ్యూహాత్మక బంధం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయని కంపెనీ వెల్లడించింది.
PNB Housing Finance AAA Rating | మేనేజ్మెంట్ హర్షం
ఈ అభివృద్ధిపై పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో అజయ్ శుక్లా స్పందిస్తూ.. గడచిన ఏడాది కాలంలో నాలుగు ప్రముఖ ఏజెన్సీల నుంచి ‘AAA’ రేటింగ్స్ దక్కడం తమ వ్యాపార మూలాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుందన్నారు. ఇది వినియోగదారుల నమ్మకాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గృహ నిర్మాణ రంగానికి తోడ్పాటునందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Stock Market Rally | మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు