అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Devi Navaratri Security | రాబోయే దేవి నవరాత్రుల పండుగ నేపథ్యంలో నిజామాబాద్(Nizamabad) కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) తెలిపారు. శుక్రవారం పెండింగ్ కేసులపై అధికారులతో భూమారెడ్డి కన్వెన్షన్లో సమీక్ష నిర్వహించారు.
Devi Navaratri Security | కేసుల పరిష్కార పురోగతిపై ఆరా..
పోలీసు అధికారులు తమ పరిధుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశం తదితరులున్నారు.
ఇది కూడా చదవండి: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమికి సోలార్ తుఫాను ముప్పుందా?