అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Deaf Students Police Awareness | బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) అన్నారు. నగరంలోని (Nizamabad) టౌన్–4 పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేసి ఆర్గనైజషన్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో బధిర విద్యార్థులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు , ఇబ్బందులు , వాటి పరిష్కారంలో పోలీసుల పాత్రపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు.
Deaf Students Police Awareness | సున్నితమైన సమస్యలు..
సమాజంలో బధిర విద్యార్థులు వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఇబ్బందులను పోలీసులు ఓపికగా విని అర్థం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా బధిరులు తమ సమస్యలను సాధారణంగా మాట్లాడి తెలియజేయలేని పరిస్థితుల్లో వారి తమ సైగలతోనే వ్యక్తపరుస్తారని తెలియజేశారు. వారు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారితో ఎలా సామరస్యంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలనే అంశాలపై పోలీసు సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా గ్రేసీ ఫౌండేషన్ సంస్థలో విద్యార్థులతో ఆత్మీయంగా మెలుగుతూ, వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్, గ్రేసీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు శోభారాణి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Deaf Students Police Awareness, CP Saichaitanya, Nizamabad Police, Deaf Students, Police Training, Grace Organization, Disability Awareness, Nizamabad News
ఇది కూడా చదవండి: ‘హనుమాన్ అంశ్’.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?