అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sneha Society Nizamabad | మానసిక దివ్యాంగులకు స్నేహా సొసైటీ అండగా నిలవడం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ అన్నారు. నగరంలోని (Nizamabad) మారుతినగర్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు.
Sneha Society Nizamabad | దివ్యాంగులను పెంచడం కష్టంగా భావించొద్దు..
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నీలిమ మాట్లాడుతూ.. దివ్యాంగులను పెంచడం కష్టంగా భావించొద్దన్నారు. అలాగే వారిని పెంచడం పెద్ద కష్టమైన పనేమి కాదని వివరించారు. అలాంటి వారికి స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన లేని రోజుల్లో ఒక మానసిక వికలాంగుల పాఠశాల ఏర్పాటు చేయాలంటే సిద్దయ్య జ్యోతిలు ఎంతో శ్రమపడి ఉంటారన్నారు.
వారి శ్రమకు ఫలితమే నేడు అనేకమంది దివ్యాంగులు విద్యను ఇతర సేవలను అందుకోగలుగుతున్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన మెడికల్ కళాశాల మానసిక వైద్యశాఖాధిపతి డాక్టర్ విశాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ దివ్యాంగ బాలలను చిన్న వయసులోనే గుర్తిస్తే వారి వైకల్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తమ నాయక్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, స్నేహ సొసైటీ కార్యదర్శి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, టాటా ఇన్సూరెన్స్ మేనేజర్ సాయిరాం, రాజశ్రీ, బాలాజీ, సత్యనారాయణమూర్తి, సుమన్, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Durga Navratri Saree Distribution | అమ్మవారికి సేవ చేయడం అదృష్టం