Sriramsagar Project | ఎగువన తగ్గిన వర్షాలు.. శ్రీరాంసాగర్​కు తగ్గుతున్న వరద..

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా : Sriramsagar Project | శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. ఎగువన మహారాష్ట్ర (Maharashtra)లో వర్షాలు తగ్గడం.. జిల్లాలోనూ తగ్గుముఖం పట్టడంతో జలాశయానికి ఇన్​ఫ్లో తగ్గింది.

Sriramsagar Project | 5,851 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5,851 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,079.30 అడుగుల వద్ద 43.091 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్​లోకి గణనీయంగా ఇన్​ఫ్లో తగ్గిపోయింది. అధికారులు ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : యెండల లక్ష్మీనారాయణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *