అక్షరటుడే, కోటగిరి : Sant Namdev Maharaj | మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్ నాందేవ్ మహరాజ్ 676వ పుణ్యతిథి వేడుకలను పోతంగల్ మండలం (Pothangal Mandal) దోమలేడ్గి విఠలేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Sant Namdev Maharaj | కామప్ప మహరాజ్ ఆధ్వర్యంలో ..
సోమవారం రాత్రి ప్రత్యేక భజనల అనంతరం ఉదయం కామప్ప మహారాజ్ ఆధ్వర్యంలో కీర్తన, భజనలు, జీవిత చరిత్ర ప్రవచనాలు వినిపించారు. మధ్యాహ్నం గులాల్, పల్లకీ సేవ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు, గట్ల రవీందర్ మాట్లాడుతూ.. పాండురంగ విఠలుని పరమ భక్తుడు సంత్ నాందేవ్ మహరాజ్ అన్నారు. కుల మతాలకతీతంగా, భక్తితత్వాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిఒక్కరు భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెల్ల గంగాధర్, శ్రీధర్, మగ్డేవార్ రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sriramsagar Project | ఎగువన తగ్గిన వర్షాలు.. శ్రీరాంసాగర్కు తగ్గుతున్న వరద..