అక్షరటుడే, ఇందూరు: Nizamabad Road Development | నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఎంపీ అర్వింద్ (MP Arvind)తో కలిసి శుక్రవారం కేంద్ర రోడ్డు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలను అందజేశారు.
Nizamabad Road Development | నగరంలోని దేవిరోడ్డు, రైల్వేస్టేషన్..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవ్‌వాడ అదనపు వంతెన ( ఆర్వోబీ) మంజూరుచేయాలని కోరామన్నారు. అలాగే సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద ఆర్యూబీఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రెండింటికి రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్‌లోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి పాత జీపీ ఆఫీస్ వరకు రూ.30కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు నగరాన్ని కలుపుతూ 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా అందజేశామన్నారు. మరొక రోడ్డు నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం, దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు ను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటివిడుదల