Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

ఎల్లారెడ్డి , నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project Water | ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

Pocharam Project Water | పొంగిపొర్లుతున్న పోచారం..​

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతోంది. దీంతో దిగువన ఉన్న చెరువులు, కుంటలు నింపేందుకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని పోచారం ప్రధాన కాలువలోకి విడుదల చేశారు.
అధికారుల లెక్కల ప్రకారం.. విడుదల చేసిన నీరు 15 రోజుల పాటు చివరి ఆయకట్టు వరకు అందుతుంది. ఆ తర్వాత 10 రోజుల పాటు నీటి విడుదల నిలిపివేయనున్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్ రజిత వెంకట్రామిరెడ్డి, రామచంద్ర రెడ్డి, వాసు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Pocharam Project Water | జలాశయం నిండడంతో ప్రత్యేక పూజలు

Pocharam Project Water

ఈ ఖరీఫ్ సీజన్‌లో కురిసిన వర్షాలకు పోచారం జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మనోహర్ రెడ్డి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 9న జలాశయం పూర్తిస్థాయిలో నిండాలని కోరుతూ అమ్మవారికి కొబ్బరికాయలు మొక్కుకున్నానని తెలిపారు. నెల రోజుల్లోనే జలాశయం నిండడంతో బీఆర్ఎస్ నాయకులతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నామని, ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. గత 20 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bhu Bharati Applications | భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *