Ganesh Immersion Safety | వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ రాజేష్​ చంద్ర

నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Ganesh Immersion Safety | నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పాత బాన్సువాడ చావిడి నుంచి కల్కి చెరువు వరకు రూట్​మ్యాప్​ను ఆయన శుక్రవారం పరిశీలించారు.

Ganesh Immersion Safety | పక్కాగా ఏర్పాట్లు జరగాలి

భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు. ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్‌ సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

Ganesh Immersion Safety | నిమజ్జన ప్రాంతంలో..

నిమజ్జన ప్రాంతంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజు, గంగాధర్, కృష్ణారెడ్డి, మాసాని శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్ ఖలేఖ్, గోపాల్‌రెడ్డి, వెంకన్న, శివదయాళ్, ఎజాజ్, వహాబ్, లింగమేశ్వర్‌, పోలీసు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: MLA Dhanpal | ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా నిధులు శూన్యం: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *