MLA Dhanpal | ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా నిధులు శూన్యం: ఎమ్మెల్యే ధన్​పాల్​

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ప్రత్యేక నిధులు విడుదల కాలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ప్రత్యేక నిధులు విడుదల కాలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు.

MLA Dhanpal | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​పై..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై సీఎం, విద్యాశాఖ మంత్రికి మూడు సార్లు లేఖలు ఇచ్చినా స్పష్టత లేదన్నారు. కళాభారతి, మాధవనగర్ బ్రిడ్జి పనులకు బిల్లులు చెల్లించలేక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారన్నారు. అలాగే నిజామాబాద్ బస్టాండ్ పరిస్థితి మండల కేంద్రం బస్టాండ్లా​ ఉందని, దీని అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)  సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని విమర్శించారు.

MLA Dhanpal | జీజీహెచ్​పై ఎన్ని సమీక్షలు నిర్వహించినా..

జీజీహెచ్ ఆస్పత్రిపై గతంలో సమీక్షలు జరిగినా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానంగా ఆస్పత్రి మార్చురీలో ఫ్రీజర్లు లేక దుర్వాసన వస్తోందన్నారు. జనరల్ వార్డుల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. 800 మంది విద్యార్థులకు ఒక బాలికల ప్రభుత్వ పాఠశాల (పబ్లిక్ స్కూల్) ఏర్పాటు ప్రతిపాదన చేసినా నిజామాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Police RI | ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *