అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police RI | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మరణించాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
Nizamabad Police RI | నివాళులర్పించిన సీపీ..
మిస్‌ఫైర్‌లో ఆర్ఐ మృతి చెందడంతో సమాచారం అందుకున్న సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ కృష్ణస్వామి, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నరేందర్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేశం సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సతీష్ మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు తరలించారు.
ఇది కూడా చదవండి..: Star Health Nizamabad | ‘స్టార్ హెల్త్’ నిజామాబాద్‌లో విస్తృతమైన సేవలందిస్తున్నాం..