Nizamabad Murder Case | సెల్​ఫోన్​ కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి హత్య

సెల్​ఫోన్​ గొడవ ఒకరి ప్రాణం తీసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Murder Case | సెల్​ఫోన్​ గొడవ ఒకరి ప్రాణం తీసింది.. ఈ ఘటన నగరంలోని మూడో టౌన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Nizamabad Murder Case | మద్యం మత్తులో సెల్​ఫోన్​ కోసం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని మూడో టౌన్ పరిధిలో న్యూ ఎన్జీవోస్ కాలనీ ప్రాంతంలో నివాసముండే గంగోని వినోద్, అతడి స్నేహితుడు జయంత్ స్నేహితులు. అయితే ఈనెల 8వ తేదీన తెల్లవారుజామున మద్యం మత్తులో ఉండగా సెల్‌ఫోన్ విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో జయంత్​ బండరాయితో గంగోని వినోద్​ తలపై కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని నిజామాబాద్​ జీజీహెచ్​కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ అక్కడ చికిత్స పొందుతూ 11వ తేదీ ఆదివారం మృతి చెందాడు. మూడో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sri Ram Sagar Project | శ్రీరామ్ సాగర్​లో తగ్గుతున్న నీటిమట్టం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *