అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab ASI Murder | పంజాబ్ (Punjab)లో మరో పోలీసును దుండగులు హత్య చేశారు. నౌషెహ్రా పన్నూనాలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు.
ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మఖులో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై ఇక్బాల్ సింగ్ ఇంటికి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారు. అతి సమీపం నుంచి పలుమార్లు కాల్పులు జరిపారు. వాటిలో రెండు బుల్లెట్లు ఇక్బాల్ సింగ్ శరీరంలో నుంచి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Punjab ASI Murder | వరుస ఘటనలు
అమృత్‌సర్‌లో అక్టోబర్ 4న ముగ్గురు దుండగులు ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్ 18 రాత్రి అమృత్‌సర్‌లోని భగతన్‌వాలా ధాన్యం మార్కెట్‌లో వ్యక్తులు ఏఎస్ఐ హర్జిత్ సింగ్‌ను కాల్చి చంపారు. పంజాబ్‌లో పోలీసులపై వరుసగా కాల్పులు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతిభద్రతలు కాపాడే పోలీసులపై కాల్పులు జరుగుతుండటంతో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
పంజాబ్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Maharashtra Unemployed Protest | మహారాష్ట్రలో ఆందోళన విరమించిన నిరుద్యోగులు