ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా కనీసం భయపడటం లేదు. ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా ఇంటి పర్మిషన్​ కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్​ చేసిన ఉద్యోగిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

జీహెచ్​ఎంసీ (GHMC) ఖైరతాబాద్​ జోన్​ పరిధిలో శ్రీలత జూనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఆమెను కోరారు. దీనికి శ్రీలత రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి జూనియర్​ అసిస్టెంట్​ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ (Hyderabad)లోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. జూనియర్​ అసిస్టెంట్​ శ్రీలతను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రిన్సిపాల్ మరియు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.

ACB Case | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *