Mental health awareness | డ్రగ్స్​ రహిత తెలంగాణ కోసం కృషి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Mental health awareness | మానసిక ఆరోగ్యం, డ్రగ్స్​కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీలో (Ramoji Film City)  ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డాక్టర్​ సర్బరి దత్తా (Sarbari Datta) పోస్టర్లను ఆవిష్కరించారు.

Mental health awareness | డ్రగ్స్​ రహిత తెలంగాణ దిశగా..

ఈ సందర్భంగా కమిటీ ఛైర్‌పర్సన్ జార్జ్​ రెడ్డి (George Reddy), కన్వీనర్ డాక్టర్​ ఆకుల విశాల్​ (Vishal Akula) మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా IMA సభ్యుల సహకారంతో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్​ రహిత తెలంగాణగా (drug free Telangana) మార్చేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ పి కిషన్​, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్​ అశోక్​ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *