జాతీయంTrisha Birthday | త్రిష బర్త్​డే రోజే.. విజయ్​ గెలుపు బావుట

Trisha Birthday | త్రిష బర్త్​డే రోజే.. విజయ్​ గెలుపు బావుట

త్రిష బర్త్​ డే రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్​ టీవీకే పార్టీ విజయం సాధించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trisha Birthday | తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ సింగిల్​ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. 108 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మెజారిటీకి కొద్ది దూరంలో టీవీకే ఆగిపోయింది. అయితే ఇతర పార్టీల మద్దతుతో విజయ్​ సీఎం కానున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే విజయ్​ గెలుపు బావుట ఎగురవేసిన నేడు నటి త్రిష పుట్టిన రోజు కావడం గమనార్హం.

ఈ రోజు విజయ్, త్రిష కృష్ణన్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే త్రిష తన 43వ పుట్టినరోజు జరుపుకుంటుండగా, అదే సమయంలో విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో సాగిస్తున్న రాజకీయ ప్రస్థానంపై అందరి దృష్టి ఉంది. త్రిష తన పుట్టినరోజున తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేరుగా విజయ్​ ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Trisha Birthday | పుట్టిన రోజు బహుమతి

విజయ్​, త్రిషల మధ్య సంబంధం గురించి చాలా పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. వీరు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు నాడు టీవీకే భారీ విజయం దక్కించుకోవడంతో సోషల్​ మీడియాలో ఈ రెండు ఘటనలను లింక్​ చేస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పుష్ప–2 (Puspha-2) సినిమాలో హీరో అల్లు అర్జున్​ తన భార్య పుట్టిన రోజు సందర్భంగా రావు రమేశ్​ను సీఎం చేస్తాడు. తాజాగా త్రిష పుట్టిన రోజు నాడు టీవీకే గెలవడంతో నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Trisha Birthday | జయలలిత అవుతారా

గతంలో తమిళనాడులో సినీ నటుడు ఎంజీఆర్​ (MGR) పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన వెంట జయలలిత (Jaya Lalitha) ఉన్నారు. ప్రస్తుతం విజయ్​ సైతం సీఎం కానున్నారు. ఆయనతో త్రిష ఉన్నారు. గతంలో జయలలితకు వివాహం కాలేదని, ప్రస్తుతం త్రిషకు కూడా పెళ్లి కాలేదని నెటిజన్లు పోలుస్తున్నారు. త్రిష మరో జయలలిత అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి: Stalin Election Defeat | డీఎంకేకు షాక్​.. సీఎం స్టాలిన్​ ఓటమి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | బీజేపీ (BJP) నేతలపై...

ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు...

Mental health awareness | డ్రగ్స్​ రహిత తెలంగాణ కోసం కృషి

అక్షరటుడే, ఇందూరు: Mental health awareness | మానసిక ఆరోగ్యం, డ్రగ్స్​కు...