అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stalin Election Defeat | తమిళనాడు (Tamil Nadu)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే తుపాన్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓడిపోయారు.
తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M.K. Stalin)పై టీవీకేకు చెందిన వి.ఎస్. బాబు గెలుపొందారు. ఈ స్థానం నుంచి స్టాలిన్ 2011 నుంచి గెలుస్తున్నారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న స్థానంలో టీవీకే విజయం సాధించడం గమనార్హం. స్టాలిన్ కేవలం 72,321 ఓట్లు మాత్రమే సాధించారు. ఆయనపై TVK అభ్యర్థి V.S. బాబు, 80,407 ఓట్లు సాధించి విజయం సాధించారు.
Stalin Election Defeat | ఓటమి పాలైన ముఖ్యమంత్రులు
తమిళనాడులో 1962 నుండి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలో ఉంది. 1967 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అన్నదురై నాయకత్వంలోని DMK అధికారాన్ని చేపట్టింది. విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కామరాజర్ ఓటమి పాలయ్యారు. 1996 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, జయలలిత నాయకత్వంలోని ADMK ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 234 నియోజకవర్గాలకు గాను, ADMK కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, తాను పోటీ చేసిన బర్గుర్ నియోజకవర్గంలో DMK అభ్యర్థి చేతిలో 8,366 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Stalin Election Defeat | హంగ్ దిశగా..
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం టీవీకే 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే కూటమి 74, అన్నా డీఎంకే కూటమి 54 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. 118 స్థానాలు గెలిస్తే సీఎం పీఠం దక్కుతుంది. విజయ్ పార్టీ (Vijay Party)కి మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విజయ్ తండ్రి ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు కోరారు. డీఎంకే కూటమిలో ఉన్న ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి..: Tamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

