SSC Hindi Translator | డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Hindi Translator | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. వివిధ శాఖలలో హిందీ ట్రాన్స్లెటర్ పోస్టుల భర్తీ కోసం ఎస్సెస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లెటర్స్ ఎగ్జామినేష్ 2026 నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసి, హిందీలో ప్రావీణ్యం ఉన్నవారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

ఖాళీల సంఖ్య : 84.
పోస్టుల పేరు :
జూనియర్ ట్రాన్స్లెషన్ ఆఫీసర్ (జేటీవో)
జూనియర్ హిందీ ట్రాన్స్లెటర్ (జేహెచ్టీ)
జూనియర్ ట్రాన్స్లెటర్ (జేటీ)
సీనియర్ హిందీ ట్రాన్స్లెటర్ (ఎస్హెచ్టీ)
సీనియర్ ట్రాన్స్లెషన్ ఆఫీసర్ (ఎస్టీవో)

SSC Hindi Translator | విద్యార్హతలు:

పోస్టును అనుసరించి అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
హిందీ లేదా ఇంగ్లిష్ లో పీజీ పూర్తై, డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లిష్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
ట్రాన్స్లెషన్ (హిందీ, ఇంగ్లిష్ )లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్లెషన్ అనుభవం ఉండాలి.

వయోపరిమితి :18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం :
సీనియర్ హిందీ ట్రాన్స్లెటర్, సీనియర్ ట్రాన్స్లెషన్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు వేతనం ఉంటుంది.
ఇతర పోస్టులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

SSC Hindi Translator | దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..

దరఖాస్తు గడువు తేదీ: మే 14.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 15.
అప్లికేషన్ సవరణ తేదీలు : మే 19, 20 తేదీల్లో..
పేపర్ -1 సీబీటీ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది.

ఎంపిక విధానం : రెండు దశల్లో రాతపరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
పేపర్ -1 లో ఆబ్జెక్టివ్ టైప్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
పేపర్ -2 లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://ssc.gov.in లో సంప్రదించగలరు.

ఇది కూడా చదవండి..: NTPC Jobs 2026 | ఎన్టీపీసీలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ. 55 వేలపైనే వేతనం!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *