TGPOLYCET Results 2026 | రేపు పాలిసెట్​ ఫలితాల విడుదల

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGPOLYCET Results 2026 | పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGPOLYCET) ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:30కు ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.

పాలిసెట్​ ఫలితాలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు నేరుగా వస్తాయి. అంతేగాకుండా మీ సేవ వాట్సాప్​ నంబర్​ ద్వారా కూడా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలు అధికారిక మీ సేవ తెలంగాణ వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా నేరుగా అభ్యర్థులకు పంపిస్తారు. ఇది అవుట్‌బౌండ్ సేవ కావున, అభ్యర్థులు ఎటువంటి అభ్యర్థన చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

TGPOLYCET Results 2026 | విడుదల కాగానే..

ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే అర్హత గల అభ్యర్థులకు వాట్సాప్​లో వస్తాయి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా PDF రూపంలో ఫలితాలను పంపుతారు. పాలిటెక్నిక్​ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 13న పాలిసెట్​ పరీక్ష నిర్వహించారు. ఫలితాల విడుదల అనంతరం రెండు విడతల్లో కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి ఇప్పటికే అధికారులు షెడ్యూల్​ విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్​ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది.

దీనిని కూడా చదవండి : Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *