జాతీయంNEET Paper Leak Arrest | నీట్​ పేపర్​ లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్

NEET Paper Leak Arrest | నీట్​ పేపర్​ లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్

నీట్​ యూజీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్​లు కొనసాగుతున్నాయి. తాజాగా పూణెలో మనీషా సంజయ్‌ హవల్దార్‌ను సీబీఐ అరెస్ట్​ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Paper Leak Arrest | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్​ యూజీ పేపర్​ లీకేజీ (NEET Exam) వ్యవహారంలో అరెస్ట్​లు కొనసాగుతున్నాయి. తాజాగా పూణె (pune)లో మనీషా సంజయ్‌ హవల్దార్‌ను సీబీఐ అరెస్ట్​ చేసింది.

దేశవ్యాప్తంగా మే 3న నీట్​ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే పేపర్​ లీక్​ అయినట్లు ఆరోపణలు రావడంతో ఎన్​టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. జూన్​ 21న మళ్లీ పరీక్ష పెడతామని ప్రకటించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మనీషాను శుక్రవారం అరెస్ట్​ చేశారు. ఫిజిక్స్‌ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం11 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.

NEET Paper Leak Arrest | ఫిజిక్స్​ పేపర్​పై యాక్సెస్​

ప్రస్తుతం పూణేలోని సేథ్ హీరాలాల్ సరఫ్ ప్రశాలలో మనీషా సంజయ్ హవల్దార్‌ను పని చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిపుణురాలిగా నియమించిన తర్వాత హవల్దార్ నీట్ యూజీ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నపత్రంపై పూర్తి యాక్సెస్ ఉంది. ఏప్రిల్‌లో ఆమె కొన్ని ప్రశ్నలను సహ నిందితురాలు మనీషా మంధారేతో పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన ఆరోపణపై పూణేకు చెందిన లెక్చరర్ పి.వి. కులకర్ణిని గతంలోనే అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అహల్యానగర్‌కు చెందిన ధనంజయ్ లోఖండే, నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్, జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్, హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్​ను అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Tiger Attack Chandrapur | తునికాకు కోసం వెళ్లి.. పులి దాడిలో నలుగురు మహిళల మృతి

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...

SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​...

Vaddi Leni Runalu | మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్: వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలకు పెంపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaddi Leni Runalu | తెలంగాణలోని మహిళా స్వయం...