అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Green Crackers | ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో దీపావళి బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు ( Supreme Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కేవలం ‘గ్రీన్ టపాసులు’ (Green Crackers) కాల్చుకోవడానికి మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 2026 నవంబర్ 7, 8 తేదీల్లో నిర్దేశిత సమయాల్లో మాత్రమే బాణసంచా పేల్చాలని స్పష్టం చేసింది.
ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయ పరిమితిని దాటి ముందు గానీ, వెనుక గానీ బాణసంచా పేల్చడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.
Delhi Green Crackers | సైలెన్స్ జోన్లలోపూర్తి నిషేధం..
ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు-కళాశాలలు , అధికారికంగా ప్రకటించిన ‘సైలెన్స్ జోన్ల’కి 300 మీటర్ల పరిధిని ‘నో-క్రాకర్ జోన్లు’గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి టపాసులు కాల్చకూడదని ఆదేశిస్తూ, ప్రజలకు అవగాహన కోసం అక్కడ ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
Delhi Green Crackers | ఆన్‌లైన్ విక్రయాలపై బ్యాన్..
క్యూఆర్ కోడ్ (QR Code) కలిగిన, నీరి (NEERI) ఆమోదించిన ప్రామాణిక గ్రీన్ టపాసులను మాత్రమే విక్రయించాలని కోర్టు స్పష్టం చేసింది. నిషేధిత రసాయనాలు ఉన్న బాణసంచా అమ్మకాలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా, ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టపాసుల డెలివరీలను పూర్తిగా నిషేధించారు.
ఈ నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా స్థానిక పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై , అక్రమంగా బాణసంచా విక్రయించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తారు.
ఇది కూడా చదవండి: Congress Party Controversy | కాంగ్రెస్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు!