Udhayanidhi Stalin | పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్​ : ఉదయనిధి స్టాలిన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin | డీఎంకే (DMK) లీడర్​, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్​ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. స్టాలిన్ నాయకత్వం, DMK సపోర్టుతో 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ (Comgress)​కు కృతజ్ఞత లేదని మండిపడ్డారు. పదవుల కోసం వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీని మళ్లీ ఎప్పటికీ నమ్మకూడదన్నారు.

నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకే కార్యకర్తల మద్దతుతో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులలో “కనీస కృతజ్ఞత, మర్యాద” కొరవడిందని ఆరోపిస్తూ, డీఎంకే “కాంగ్రెస్‌ను మళ్లీ ఎప్పటికీ నమ్మకూడదు” అని ఆయన ఒక పార్టీ కార్యక్రమంలో అన్నారు.

Udhayanidhi Stalin | డీఎంకేతోనే గెలిచింది

కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణమని ఉదయనిధి అన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నందుకే వారికి ఓటు వేశారని చెప్పారు. కానీ పదవుల కోసం, మాకు సమాచారం ఇవ్వకుండా వారు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస కృతజ్ఞత, మర్యాద లేని కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదని పేర్కొన్నారు. వారిని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని తెలిపారు. తమిళనాడు ప్రజలు వారికి అతి త్వరలోనే తగిన గుణపాఠం నేర్పిస్తారు ఉదయనిధి అన్నారు.

Udhayanidhi Stalin | కాంగ్రెస్సే కారణం

దేశవ్యాప్తంగా బీజేపీ (BJP) విజయానికి మోదీ, అమిత్ షా కారణమని నేను భావించాను. కానీ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని ఇప్పుడు స్పష్టమైంది అని ఉదయనిధి పేర్కొన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారని గుర్తు చేశారు. ఇటీవలి రాష్ట్ర ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది తేడాతో ఓడిపోయిన టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

దీనిని కూడా చదవండి : Elephant Rampage | ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *