అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shashi Tharoor | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశి పర్యటన గురించి అడగ్గా.. తాను ఆయన ట్రావెల్ ఏజెంట్‌ను కాదన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి, సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై విలేకర్లు ఎంపీ శశిథరూర్‌ను ప్రశ్నించగా.. ఘాటుగా స్పందించారు. తాను ట్రావెల్ ఏజెంట్‌ను కాదని పేర్కొన్నారు. తనను ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదన్నారు. ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి, దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనని చెప్పారు.
Shashi Tharoor | వియత్నాం వెళ్లిన రాహుల్
నిరసనలు జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటన కోసం వియత్నాం వెళ్లారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయిన రాహుల్ గాంధీ, విహారయాత్రకు వెళ్లారని బీజేపీ ఆరోపించింది. ఆయన పర్యటన వెనుక ఉన్న ఎజెండా ఏమిటని ప్రశ్నించింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాలన మార్పు కోసం ప్లాన్ చేస్తున్నారని, జార్జ్ సోరోస్ వద్ద శిక్షణ తీసుకునేందుకే విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఆయనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: CJP Leaders Released | జైలు నుంచి విడుదలైన సీజేపీ నాయకులు